సంప్రదాయానికి బ్రేక్‌: ఆండ్రాయిడ్‌ 10 పేరిదే!

సంప్రదాయానికి బ్రేక్‌: ఆండ్రాయిడ్‌ 10 పేరిదే!

గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ నుంచి కొత్త ఓఎస్‌ వెర్షన్‌ వస్తోందంటే చాలు.. అందులో ఫీచర్ల మాట అటుంచితే దానికి ఏం పేరు పెడతారా?అనే ఆసక్తే ఎక్కువ. ఇప్పటి వరకు విడుదల చేసిన ఓఎస్‌ వెర్షన్లకు పలు రకాల తీపి పదార్థాల పేర్లు పెడుతూ వస్తున్న గూగుల్‌.. ఈ సారి ఆ సంప్రదాయానికి తెర దించింది. కొత్తగా విడుదల చేయబోయే ఓఎస్‌ వెర్షన్‌కు సింపుల్‌గా ‘ఆండ్రాయిడ్‌ 10’ అని నామకరణం చేసింది. ఈ మేరకు గూగుల్‌ అధికారికంగా దీన్ని వెల్లడించింది. దీంతో తీపి పదార్థాల పేర్లు పెట్టే ఆనవాయితీకి చరమగీతం పాడినట్లైంది. దీంతో పాటు ఆండ్రాయిడ్‌ 10 లోగోను కూడా కొత్తగా రూపొందించింది. ఆండ్రాయిడ్‌ రోబో కూడా ఈసారి పేరు పైన ఉండేట్లుగా ఏర్పాటు చేసింది. లోగో రంగును కూడా ఆకుపచ్చ నుంచి నలుపు రంగుకు మార్చింది. కళ్లకు ఇంపుగా కనిపించడంతో పాటు, దృష్టి లోపం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు గూగుల్‌ తెలిపింది. రాబోయే కొన్నివారాల్లో ఆండ్రాయిడ్‌ 10ను అధికారికంగా విడుదల చేయనుంది.
కొత్త ఓఎస్‌కు పేరు పెట్టే సంప్రదాయానికి తొలిసారి మార్పు చేసినట్లు ఆండ్రాయిడ్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ సమత్‌ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకుని, అందరికీ అర్థమయ్యే విధంగా దీనికి సింపుల్‌గా ఆండ్రాయిడ్‌ 10 అని నామకరణం చేసినట్లు తెలిపారు.
పాత పేర్లివే..
ఆండ్రాయిడ్‌ 1.6- డోనట్‌
ఆండ్రాయిడ్‌ 2.0, 2.1-ఎక్లెయిర్‌
ఆండ్రాయిడ్‌ 2.2 - ఫ్రోయో
ఆండ్రాయిడ్‌ 2.3, 2.4- జింజర్‌ బ్రెడ్‌
ఆండ్రాయిడ్‌ 3.0, 3.1, 3.2- హనీ కోంబ్‌
ఆండ్రాయిడ్‌ 4.0- ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌
ఆండ్రాయిడ్‌ 4.1 -జెల్లీబీన్‌
ఆండ్రాయిడ్‌ 4.4-కిట్‌క్యాట్‌
ఆండ్రాయిడ్‌ 5- లాలీపాప్‌
ఆండ్రాయిడ్‌ 6- మార్ష్‌మాలో
ఆండ్రాయిడ్‌ 7- నౌగట్‌
ఆండ్రాయిడ్‌ 8- ఓరియో
ఆండ్రాయిడ్‌9- పై

Comments

Popular posts from this blog

How are Cloud Storage, Cloud Backup, and Cloud Sync Different

How to Solve “File Is Open in Another Program” Error in Windows 10

4 of the Best Alternatives to AutoCAD