Posts

Showing posts from June, 2019

How to Format a Drive in FAT32 in Windows 10

Image
How to Format a Drive in FAT32 in Windows 10 FAT32 is a versatile file system that has been around for decades. Unfortunately, Windows 10 does not allow users to format USB or hard disk drives larger than 32GB in FAT32. Fortunately, there are ways around this. What Is FAT32? FAT stands for File Allocation Table, and it is a computer file system architecture. Without getting too technical, think of FAT as the language your files are written in. Because FAT was introduced way back in 1977, it is compatible with virtually all operating systems. This means that Macs, PCs, Linux machines and even phones can read FAT files. Because of FAT’s near universal compatibility, it is the ideal format for file sharing between devices. It is for this reason that most USB drives and SD cards are formatted in FAT32 straight from the manufacturer. It doesn’t matter what device or operating system you use it with, as it’s going to work right out of the box with no additional formatting requir

బండిలో.. బ్రహ్మాస్త్రం

Image
ప్రమాదంలో సాక్షిలా ఉపయోగపడుతుంది... నిబంధనల ఉల్లంఘనుల్ని నిలువరిస్తుంది... బీమా వాదనలో మన తరపున వకాల్తా పుచ్చుకుంటుంది... కారులో డాష్‌కామ్‌ బిగిస్తే కలిగే సౌలభ్యాలెన్నో... ఖరీదు తక్కువ.. వాడటం తేలిక... ప్రతి వాహనంలో తప్పనిసరి గ్యాడ్జెట్‌లా మారిపోతున్న ఈ డాష్‌బోర్డ్‌ కెమెరా ఉపయోగాలు, వాడే విధానం, జాగ్రత్తలు.. వివరంగా తెలుసుకుందాం. తే లిగ్గా చెప్పాలంటే డాష్‌బోర్డ్‌ మీద బిగించే కెమెరానే డాష్‌కామ్‌. దీన్ని రేయర్‌వ్యూ మిర్రర్‌కి ముందూ అతికించుకోవచ్చు. ప్రయాణంలో విండ్‌షీల్డ్‌కి ఆవలివైపు రోడ్డుపై జరిగే ప్రతి దృశ్యాన్నీ రికార్డు చేస్తుందిది. దీని తీగను యూఎస్‌బీ లేదా సిగరెట్‌ లైటర్‌ పోర్ట్‌ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. తర్వాత కారు ఇంజిన్‌ ఆన్‌ చేయగానే ఆటోమేటిగ్గా పని ప్రారంభిస్తుంది. ఏవైనా అల్లర్లు, ప్రమాదాలు జరిగినపుడు నిందితుల్ని గుర్తించే ఉద్దేశంతో అమెరికా పోలీసులు తమ వాహనాల్లో మొదటిసారి ఈ డాష్‌కామ్‌లు ఉపయోగించారు. తర్వాత వ్యక్తిగత వాహనాల్లోనూ వాడకం మొదలైంది. బేసిక్‌ నుంచి హై-ఎండ్‌ కారు వరకు ఎందులో అయినా దీన్ని అమర్చుకోవచ్చు. మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూలాంటి  కొన్ని ఖరీదైన కార్లల

తొలకరిలో పులకించండి

Image
తొలకరిలో పులకించండి చినుకు పడితే పుడమి పరిమళిస్తుంది..నీటి ముత్యాలతో రెమ్మలన్నీ మెరిసిపోతుంటాయి. కొమ్మను కదిపితే చాలు.. చిరుజల్లు కురిసి తనువంతా తడిసిపోతుంది. ఈ అనుభవం ఇంటి వాకిట్లో ఎదురైతేనే మనసు పులకించిపోతే.. మేఘాలను ముద్దాడే కొండ కొనల్లో తారసపడితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. అందుకే, రుతురాగాలు మొదలవుతున్న వేళ.. ఆనందపు శిఖరాలకు చేరుకోండి.. వానజల్లులో కేరింతలు కొడుతూ..వరుణ సందేశాన్ని అందుకోండి. వనంలో వాలిపోదాం    వాల్పరాయ్‌, తమిళనాడు  తమిళనాడులోని అన్నామలై కొండల్లో ఉన్న అందమైన ప్రాంతం వాల్పరాయ్‌. ఇది కోయంబత్తూరు జిల్లాలో అన్నామలై టైగర్‌ రిజర్వ్‌లో భాగమై ఉంది. సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉన్న వాల్పరాయ్‌కి ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. దట్టమైన అడవి, ఎటు చూసినా కొండలు, కాఫీ, తేయాకు తోటలతో అలరించే ఈ ప్రాంతం.. తొలకరి వేళ మరింత అద్భుతంగా దర్శనమిస్తుంది. కూజంగల్‌ నది జోరు, చిన్న చిన్న జలపాతాల హోరు ప్రకృతిగీతాన్ని వినిపిస్తాయి. ఏనుగులు, జింకలు, నెమళ్లు, రకరకాల పక్షులు జీవవైవిధ్యాన్ని కళ్లముందుంచుతాయి. చూడాల్సినవి: *  వాల్పరాయ్‌కి 60 కిలోమీటర్ల దూర