Posts

Showing posts from August, 2017

విండోస్‌లో మ్యాక్‌... ఫీచర్లు రాక్‌!

Image
విండోస్‌లో మ్యాక్‌...   ఫీచర్లు రాక్‌! ఆపిల్‌ కంప్యూటర్లలో ఉండే కొన్ని ఆప్షన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. విండోస్‌ సిస్టమ్స్‌లో లేని ఉపయుక్తమైన సదుపాయాల్ని అందిస్తున్నాయి. మీ ల్యాపీ/కంప్యూటర్‌కు ఈ సాఫ్ట్‌వేర్లను జోడిస్తే విండోస్‌లో రాకింగ్‌ మ్యాక్‌ ఫీచర్లను పొందొచ్చు. ఏమున్నాయో చెప్పండి సె ర్చ్‌ చేసేటప్పుడు మ్యాక్‌లో ఫోల్డర్లు వేగంగా లోడ్‌ అవుతాయి. విండోస్‌లో ఈ ప్రోసెస్‌ ఆలస్యంగా ఉంటుంది. ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి సిస్టమ్‌ సెట్టింగ్స్‌లో చిన్న మార్పు చేసుకుంటే సరి. ఫోల్డర్‌పై మౌస్‌తో రైట్‌ క్లిక్‌ చేసి ‘కస్టమైజ్‌’ ఆప్షన్‌లోకి వెళ్లండి. ఆ ఫోల్డర్‌లో ఏముంచుతారు అని అడుగుతుంది. అక్కడ ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, మ్యూజిక్‌ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీకు కావల్సిన దాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత సెర్చ్‌ చేసినప్పుడు ఫలితాల్ని వీలైనంత త్వరగా పొందొచ్చు. స్క్రీన్‌ షాట్‌ కోసం   విం డోస్‌ సిస్టమ్‌లో స్క్రీన్‌ షాట్‌ తీయాలంటే... కీబోర్డులోని ప్రింట్‌ స్క్రీన్‌ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఫొటోషాప్‌ లేదా పెయింట్‌లోకి వెళ్లి పేస్ట్‌ చేసుకొని క్రాప్‌ చేసుకోవాలి.